‘వెంకీ’ ఎప్పటికీ ప్రత్యేకమే!

Dec 30,2023 08:30 #movie, #srinu vytla

తన కెరీర్‌లో ‘వెంకీ’ చిత్రం ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు. రవితేజ హీరోగా ఆయన 2004లో తెరకెక్కించిన ఈ సినిమా శనివారం నాడు రీ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల ఓ ప్రత్యేక వీడియోను పోస్టు చేశారు. ‘నాకెంతో ఇష్టమైన వెంకీ సినిమా రీ రిలీజ్‌ కావడం సంతోషంగా ఉంది. ఆ సినిమా ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వొస్తుంటుంది. దాని షూటింగ్‌నంతా సరదాగా చేశాం. ఆ సినిమా అంత బాగా రావటానికి ప్రధాన కారణం రవితేజ. యువత ఎదుర్కొనే సవాళ్లు..వారి భావోద్వేగాలతో తెరకెక్కించాం. ఇది ఎవర్‌గ్రీన్‌ చిత్రం. బ్రహ్మానందం పాత్రకు ఎంతో ఆదరణ లభించింది. రీ రిలీజ్‌ టికెట్ల బుకింగ్‌ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది’ అని పేర్కొన్నారు.

➡️