వేసవిలో భారతీయుడు-2 ?

Jan 23,2024 19:21 #Kamal Haasan, #movie

హీరో కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భారతీయుడు-2. భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్‌. తమిళ సంవత్సరాదిరోజైన ఏప్రిల్‌ 14న ఈ సినిమా వేసవివి విడుదల చేయటానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందని ఇటీవలే చిత్రబృదం ప్రకటించిన విషయం విదితమే. అయితే అధికారికంగా తేదీ ప్రకటించాల్సివుంది. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌ కీలకపాత్రలు పోషించారు.

➡️