వైవా హర్ష కామిక్‌ యాక్టర్‌

Feb 20,2024 19:05 #harsha, #movie

వైవా హర్ష కీలక పాత్రలో నటించిన ‘సుందరం మాస్టర్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో దివ్య శ్రీపాద కథానాయిక. కళ్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. ఆర్‌టీ టీం వర్క్స్‌, గోల్‌ డెన్‌ మీడియా పతాకాలపై రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్రు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్ధూ జొన్నలగడ్డ అతిథిగా హాజరై బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేశారు. ‘వైవా హర్షను ఓ కమెడియన్‌ అని చెప్పాడం నాకు నచ్చదు. అతను కామిక్‌ యాక్టర్‌. తనకంటూ ఓ కామెడీ టైమింగ్‌ ఉంటుంది. హర్ష ఎప్పటికప్పుడు నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్‌ సంతోష్‌ చేస్తున్న తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలి’ అని ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడారు.

➡️