”వ్యూహం” ట్రైలర్‌ 2 రిలీజ్‌

Dec 15,2023 19:01 #movie, #ramgopal varma

అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే తన ”వ్యూహం” సినిమా రిలీజ్‌ ను కూడా ఎవరూ అడ్డుకోలేరని ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ఆర్జీవీ ”వ్యూహం” సినిమాను రూపొందించారు. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌ లో దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మించారు. ఈ సినిమాలో వైఎస్‌ జగన్‌ పాత్రలో అజ్మల్‌ నటించగా వైఎస్‌ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్‌ అడ్డంకులు దాటుకున్న వ్యూహం సినిమా క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ తో ఈ నెల 29న గ్రాండ్‌ గా థియేటర్స్‌ లోకి రాబోతోంది. శుక్రవారం వ్యూహం సినిమా ట్రైలర్‌ 2 ను రిలీజ్‌ చేశారు. నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌, నటీనటులు అజ్మల్‌, మానస తదితరులు పాల్గొన్నారు.

➡️