శరవేగంగా ‘లగ్గం’ చిత్రీకరణ

Feb 15,2024 19:05 #movie, #rajendraprasad

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వేణుగోపాల్‌ రెడ్డి నిర్మిస్తున్న తాజా ప్రాజెక్టు ‘లగ్గం’. రమేష్‌ చెప్పాల ఈ సినిమాకు రచన -దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 5న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తవుతుందని మేకర్స్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 23 నుంచి రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అవుతుందని, మొదటి షెడ్యూల్‌ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందని తెలిపారు. రాజేంద్రప్రసాద్‌, రోహిణి, సాయి రోనాక్‌, ఎల్‌.బి శ్రీరామ్‌, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : చరణ్‌ అర్జున్‌.

➡️