‘శ్రీరంగ నీతులు’ ఫస్ట్‌ సింగిల్‌ ‘వినరా వినరా…

Feb 17,2024 19:35 #movie, #suhas

‘సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్‌ వీఎస్‌ఎస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్‌ విడుదల చేశారు. తాజాగా ఫస్ట్‌ సింగిల్‌ ‘వినరా వినరా చెబుతా వినరా ఈ కాలం శ్రీరంగ నీతులు’ అనే పాటను చిత్రబృందం విడుదలచేసింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటకు అజరు అరసాడ సంగీతాన్ని అందించారు.

➡️