”షరతులు వర్తిసాయి” సినిమా ట్రైలర్‌ రిలీజ్‌

Mar 4,2024 07:54 #movie

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ”షరతులు వర్తిస్తాయి”. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌ లైట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ”షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15వ తేదీన గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

నటుడు సంతోష్‌ యాదవ్‌ మాట్లాడుతూ – నేను ఇండిస్టీలోకి వచ్చి 20 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల కెరీర్‌ లో ”షరతులు వర్తిసాయి” సినిమాతో నాకొక మంచి అవకాశం లభించింది.

నిర్మాత డాక్టర్‌ కృష్ణకాంత్‌ చిత్తజల్లు మాట్లాడుతూ – ఒక మంచి సినిమాతో మా సంస్థ లాంఛ్‌ అవుతుండటం హ్యాపీగా ఉంది. మా ప్రొడక్షన్‌ కు ఒక లాంగ్‌ రన్‌ ఉండాలని ప్లాన్‌ చేస్తున్నాం. మా టీమ్‌ కు సపోర్ట్‌ గా ఉన్న మామిడి హరికృష్ణ, మధుర శ్రీధర్‌ రెడ్డి గారికి థ్యాంక్స్‌. ”షరతులు వర్తిసాయి” సినిమాను మీరంతా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. ”షరతులు వర్తిసాయి” ఈ నెల 15న థియేటర్స్‌ లో రిలీజ్‌ అవుతోంది. తప్పకుండా చూడండి. అన్నారు.

➡️