షూటింగ్‌లో నితిన్‌ కొత్త ప్రాజెక్టు

Jan 24,2024 19:15 #movie, #Nithin

వెంకీ కుడుములతో నితిన్‌ చేస్తున్న కొత్త ప్రాజెక్టు ‘విఎన్‌-2’ నుండి తాజా అప్డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. నితిన్‌, ఇతర కీలక నటీనటులు ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్‌లో పాల్గంటున్నారు. కేరళలో షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ జనవరి 26, 2024న ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది. సినిమాలో హీరోయిన్‌ ఎవరనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

➡️