సంగీత దర్శకుడు రషీద్‌ఖాన్‌ మృతి

Jan 10,2024 08:35

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్‌ఖాన్‌ (55) అనారోగ్యంతో కోల్‌కతాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గత నెలలో ఆసుపత్రిలో చేర్పించారు. రషీద్‌ఖాన్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. ‘జబ్‌ వి మెట్‌’ అనే చిత్రంలో ‘ఆవోగే జబ్‌తుమ్‌’ అనే పాటతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. కళారంగంలో ఆయన చేసిన సేవలకుగాను కేంద్రప్రభుత్వం పద్మశ్రీ, 2006లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. 2022లో పద్మభూషణ్‌ అవార్డును ప్రధానం చేసింది.

➡️