సందీప్‌ కొత్త సినిమా

Mar 12,2024 19:16 #movie, #sandeep kishan

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ దర్శకుడు త్రినాధరావు నక్కినతో తన తరువాతి సినిమాను చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబందించిన ప్రకటన విడుదలైంది. ‘ఎస్‌కో30’ వర్కింగ్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథని అందిస్తున్నారు. కామెడీ అండ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు

➡️