సలార్‌ చిత్రం నాకు చాలా ముఖ్యం : శృతిహాసన్‌

Dec 20,2023 19:23 #movie, #sruthihasan

హీరో ప్రభాస్‌తో కలిసి తాను నటించిన తాజా చిత్రం సలార్‌ తనకెంతో ముఖ్యమైన చిత్రమని హీరోయిన్‌ శృతిహాసన్‌ చెప్పారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నారు. ”సలార్‌లో వైవిధ్యమైన రోల్‌లో నటించాను. మా తండ్రి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కష్ట సమయంలో కూడా నవ్వుతూ ఉండటం ఆయన ప్రత్యేకత. గతంలో నాకు స్నేహితులతో కలిసి పబ్బులకు వెళ్లి మద్యం సేవించే అలవాటు ఉండేది. దానికి బానిసయ్యానని భావించి మానేశాను. మద్యం మానేసి ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతోంది.” అని అన్నారు.

➡️