సెప్టెంబరు 27న ‘ఓజీ’

Feb 6,2024 19:10 #movie, #pawan kalyan

పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ఓజీ’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. సెప్టెంబర్‌ 27న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు డి.వి.వి ఎంటర్‌టైనమెంట్‌ సంస్థ ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్టర్‌ పోస్ట్‌ చేసింది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకుడు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక ఆరుళ్‌ మోహన కథానాయిక. ఇమ్రాన్‌ హాస్మీ, అర్జున్‌ దాస్‌, ప్రకాష్‌రాజ్‌, శ్రియా రెడ్డి, హరీష్‌ ఉత్తమన్‌, అజయ్ ఘోష్‌ కీలక పాత్రధారులు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

➡️