సైంధవ్‌ అలరిస్తుంది : వెంకటేష్‌

Jan 3,2024 19:30 #movie, #Venkatesh

‘సైంధవ్‌ నా కెరీర్‌లోనే ఒక బెస్ట్‌ ఫిల్మ్‌. మంచి ఎమోషన్‌, న్యూ ఏజ్‌ యాక్షన్‌లో ఉంటుంది. సంక్రాంతికి ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది’ అని హీరో వెంకటేష్‌ అన్నారు. ఈనెల 13న విడుదల కానున్న సైంధవ్‌ సినిమా ట్రైలర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ‘సైంధవ్‌కు ఎప్పటిలాగానే మీ అందరి ప్రేమ, అభిమానం, ప్రోత్సాహం కావాలి. 75వ సినిమాగా సైంధవ్‌ చేయటం అదృష్టంగా భావిస్తున్నా’ అని వివరించారు. దర్శక నిర్మాతలు శైలేష్‌ కొలను, వెంకట్‌ బోయనపల్లి మాట్లాడుతూ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. శ్రద్ధా శ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా ఈ సినిమాలో నటించారు.

➡️