స్కూల్‌డ్రెస్‌లోనే ఆడిషన్స్‌లో పాల్గొన్నా : ఆలియాభట్‌

Dec 13,2023 19:30 #aliyabhat, #movie

‘నేను 11వ తరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు నాకు కరణ్‌ జోహార్‌తో మీటింగ్‌ ఉన్నట్లు ఫోన్‌కాల్‌ వచ్చింది. స్కూల్‌లో ఉన్న నేను యూనిఫామ్‌తో కరణ్‌ని కలవడానికి ఆయన ఆఫీస్‌కి వెళ్లాను. అప్పుడు నేను ఎక్కువ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తింటూ చాలా బద్దుగా ఉండేదాన్ని. నన్ను చూసిన వెంటనే ఆడిషన్‌ ఇవ్వాలని అన్నారు’ అని బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ అన్నారు. తన తొలి సినిమా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ను గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఆమె పోస్టు పెట్టారు. ఇటీవల జడ్డాలో జరిగిన రెడ్‌ సీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2023లో పాల్గన్న అలియా తన మొదటి సినిమా ఆడిషన్‌ ఎలా జరిగిందనే జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. ‘ఆడిషన్‌ అంటే ఏమిటో తెలియకుండానే లోపలికి వెళ్లి పాల్గన్నాను. నేను ఆ సినిమాలో నాయికగా ఎంపికయ్యానని కరణ్‌ చెప్పిన ఆ క్షణం నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆనందంతో ఒక కప్‌ కేక్‌ తినొచ్చా అని కరణ్‌ను అడిగా(నవ్వుతూ). ఆ విషయం తెలిసిన మా అమ్మ నేను సినిమాల్లో నటించడానికి కొంచెం సంకోచించినా మా నాన్న మాత్రం అంగీకరించారు’ అంటూ గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాలో ఆమె నటిస్తున్నారు.

➡️