హరీష్‌తో రవితేజ కొత్త చిత్రం

Dec 14,2023 19:05 #movie, #raviteja

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా కొత్త చిత్రం ఖరారైంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చిత్రబృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. గతంలో రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘మిరపకారు’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ‘ఈసారి మాస్‌ రీయూనియన్‌ స్పైసీగా ఉంటుంది’ అని మేకర్స్‌ తెలిపారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

➡️