హృతిక్‌, ఎన్టీఆర్‌ల ‘వార్‌ 2’

Dec 1,2023 08:53 #movie

హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న చిత్రం వార్‌ 2. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. 2025 ఆగస్టు 14న ఈ సినిమా విడుదల చేయబోతున్నామని చిత్రబృందం ప్రకటించింది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ద్వారా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. ‘దేవర’ చిత్రీకరణతో బిజీగా ఉన్న ఆయన ‘వార్‌ 2’ కోసం సంక్రాంతి తర్వాత సెట్లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం.

➡️