‘105..’ కి హన్సికే సరిపోతారు-బొమ్మకు శివ

Jan 24,2024 19:30 #hansika, #movie

హన్సిక నటిస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్‌’. ఒకటే పాత్రతో ప్రయోగాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కింది. జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బమ్మకు శివ చిత్ర విశేషాలు ముచ్చటించారు. ‘సినిమాలంటే నాకు చాలా ప్యాషన్‌. ఎప్పటికన్నా ఒక సినిమా నిర్మించాలని కల ఉండేది. అది ఈ సినిమాతో నెరవేరింది. కథ విన్నప్పటి నుంచి కథ మీద ఇంట్రెస్ట్‌ బాగా ఎక్కువైంది. ఫస్ట్‌ సినిమా చేస్తే ఈ కథతోనే చేయాలనుకున్నాను. ఈ కథకి హన్సిక సెట్‌ అవుతారని ఆమెని కలిశాం. ఒక కొత్త జోనర్‌లో ప్రయోగాత్మకంగా రావాలనుకున్నాం, అందుకే 105 మినిట్స్‌ కథని ఎంచుకున్నాం. సినిమా మొత్తం ఒకటే పాత్ర ఉంటుంది, ఇంకో గొంతు వినిపిస్తుంది ఆ గొంతు ఓ హిందీ నటుడిది’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తోంది. మొదట తెలుగులో ఆ తరువాత నెలకో భాష చొప్పున ఐదు నెలలు విడుదలచేస్తామని నిర్మాత తెలిపారు.

➡️