12TH ఫెయిల్‌కు అరుదైన గౌరవం

Feb 9,2024 19:20 #movie

విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 12TH ఫెయిల్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎండీబీ) తాజాగా ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 250 ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేసింది. అందులో12TH ఫెయిల్‌ 50వ స్థానంలో నిలిచింది. టాప్‌ 50లో ఉన్న ఏకైక ఇండియన్‌ సినిమా ఇదే. దీనిపై దర్శకుడు విధు వినోద్‌ చోప్రా స్పందిస్తూ .. ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్‌ పొందిన ఇండియన్‌ సినిమాగా ఈ చిత్రం గతంలోనే రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. హాలీవుడ్‌ చిత్రాలను వెనక్కి నెట్టి 9.2 రేటింగ్‌తో సంచలనం సృష్టించింది.

➡️