15న లంబసింగి విడుదల

Mar 8,2024 19:30 #bharadwaj, #movie

బిగ్‌బాస్‌ ఫేం దివి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘లంబసింగి’. ‘ఎ ప్యూర్‌ లవ్‌ స్టోరీ’ అనేది ఉప శీర్షిక. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. భరత్‌రాజ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ‘నచ్చేసిందే నచ్చేసిందే’, ‘వయ్యారి గోదావరి’ పాటలను చిత్ర యూనిట్‌ ఇటీవల విడుదల చేసింది. జవేద్‌ ఆలీ ఆలపించిన ఈ పాటలకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యాన్ని అందించారు. ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ సంగీతాన్ని అందించారు.

➡️