2న వ్యూహం విడుదల

Feb 28,2024 19:23 #movie, #ramgopalvarma

తాను తీసిన ‘వ్యూహం’ సినిమా మార్చి 2న విడుదల కానుందని దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెలిపారు. తొలుత ఈనెల 25న విడుదల చేయాలని భావించామని, సాంకేతిక కారణాలతో మార్చి 1కి వాయిదా వేశామని తెలిపారు. అయితే ఇప్పుడు ఒకరోజు ఆలస్యంగా మార్చి 2వ తేదీన విడుదల చేస్తున్నామని చెప్పారు. ‘పట్టు వదలని విక్రమార్కుడిని’ అనే క్యాప్షన్‌తోపాటు సెన్సార్‌ సర్టిఫికెట్‌ను చేతిలో పట్టుకుని ఉన్న ఫొటోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. వ్యూహం సినిమా విడుదలను నిలిపేయాలని కోరుతూ నారా లోకేష్‌ తెలంగాణా హైకోర్టును పిటిషన్‌ వేయటంతో ఇప్పటివరకూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా శపథం కూడా రానుంది.

➡️