21 రోజుల పుటేజ్‌ పోయింది..

రజినీకాంత్‌ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘లాల్‌సలామ్‌’. ఈ మూవీలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేదు. ‘రజనీకాంత్‌ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రజెంటేషన్‌కు సంబంధించి స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులుచేర్పులు చేసి.. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను యాడ్‌ చేశాం. ఈ మార్పులు సినిమా పరాజయానికి కారణమయ్యాయి’ అని ఐశ్వర్య గతంలో ఓ ఇంటర్య్వూలో తెలిపారు. తాజాగా ఈ మూవీ పరాజయానికి సంబంధించి మరో విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీ ఫస్ట్‌ ఆఫ్‌కు సంబంధించి 21 రోజుల ఫుటేజ్‌ కోల్పోయినట్లు ఐశ్వర్య వెల్లడించారు. ‘క్రికెట్‌కు సంబంధించిన సన్నివేశాలను 20 కెమెరాలతో నిజమైన మ్యాచ్‌లా షూట్‌ చేశాం. మా దురదృష్టం కొద్ది అది పోగొట్టుకున్నాం. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికి విష్ణు విశాల్‌, నాన్న (రజనీకాంత్‌) సహా మరికొంతమంది నటులు వేరే సినిమాల కోసం గెటప్‌లు మార్చుకున్నారు. అందుకే రీ షూట్‌ చేయలేకపోయాం. చివరికి మిగిలి ఉన్న దానితో సినిమాను ఎడిట్‌ చేశాం’ ఈ ప్రభావం సినిమాపై గట్టిగా పడిందంటూ ఐశ్వర్య చెప్పారు.

➡️