27న రామ్‌చరణ్‌ కొత్త మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల

Feb 24,2024 19:16 #movie, #Ram Charan

హీరో రామ్‌చరణ్‌ కొత్త సినిమా మార్చిలో ప్రారంభంకానుంది. ఇప్పటికే రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమా షూటింగ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఆర్‌సి16 మూవీ గురించిన కీలక సమాచారాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ సినిమాకు వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది. సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలును ఎంపిక చేశామని పేర్కొంది. ఈనెల 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు కావటంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని శనివారం ప్రకటించింది. ఈ సినిమాలో కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌, హీరోయిన్‌ జాన్వీకపూర్‌ కూడా నటిస్తున్నట్లుగా సమాచారం. ఉత్తరాంధ్ర బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తీయబోతున్నారు. ఇప్పటికే ఆ యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం ఇప్పటికే ఆడిషన్స్‌ జరిగాయి. ప్రీ ప్రొడక్షన్‌ వర్కు కూడా జరుగుతోందని సమాచారం. ఈనెల 27న అభిమానులకు కానుకగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయటానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

➡️