5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు

Feb 1,2024 19:15 #movie

వెట్రిమారన్‌ తెరకెక్కించిన ‘విడుదలై -1’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘విడుదలై-2’ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే థియేటర్‌ రిలీజ్‌ కన్నా ముందు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి ఈ చిత్రం వెళ్లనుంది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం రాత్రి రొట్టెర్‌ డామ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో విడుదలై పార్ట్‌ 1, 2 సినిమాలు ప్రీమియర్‌ షోలు వేశారు. షో చూసిన ప్రేక్షకులు లేచి నుంచొని దాదాపు 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టి చిత్ర యూనిట్‌ని అభినందించారు. ప్రదర్శన తరువాత ప్రేక్షకులతో కలసి తీసుకున్న ఫొటోని చిత్రబృందం సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో విజరు సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో నటించారు. ఇంకా విడుదల తేదీ ప్రకటించని ఈ చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్స్‌ రిలీజ్‌ చేస్తోంది.

➡️