#90 s గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌

Jan 20,2024 07:55 #movie, #sivaji

హీరో శివాజీ, వాసుకి ఆనంద్‌ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌ సిరిస్‌ ‘#90 s ‘ ‘ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ . ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్‌ సిరిస్‌ ని ఎంఎన్‌ఓపీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజశేఖర్‌ మేడారం నిర్మించారు. నవీన్‌ మేడారం సమర్పించారు. ఈటీవీ విన్‌’వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరిస్‌ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో యూనిట్‌ గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ ని నిర్వహించింది. సక్సెస్‌ మీట్‌ లో హీరో శివాజీ మాట్లాడుతూ.. #90 s ‘ ‘ ఒక్క ఎపిసోడ్‌ విన్నా ఓకే చేసే కథ ఇది. అంత బావుంది. నేను చేసిన ‘మిస్సమ్మ’ అప్పటికి ఇండియన్‌ టాప్‌ 50సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఫిలింలా కూడా విడుదల చేస్తారని అనుకుంటున్నాను. మంచి కంటెంట్‌ ని ప్రోత్సహించడానికి ఈ వేడుకకు విచ్చేసిన ఆర్పీ పట్నారు గారికి ధన్యవాదాలు. అజీం వండర్‌ ఫుల్‌ కెమరామెన్‌. సురేష్‌ చాలా చక్కని మ్యూజిక్‌ ఇచ్చారు. సాంప్రదాయని ట్యూన్‌ సోషల్‌ మీడియాలో మారుమ్రోగుతోంది. టీం అందరూ అద్భుతంగా పని చేశారు. ప్రొడక్షన్‌ అంత చాలా చక్కగా జరిగింది. ప్రతి క్యారెక్టర్‌ ని దర్శకుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. మౌళి, రోహన్‌, వాసంతిక అందరూ చక్కగా చేశారు. అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. వాసుకి గారు చాలా అద్భుతంగా నటించారు. ఈటీవీ విన్‌ కృతజ్ఞతలు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” తెలిపారు.

➡️