ఆస్పత్రిలో చేరిన నటుడు సాయాజీ షిండే

Apr 12,2024 18:05 #movie, #sayaji shinde

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. గురువారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. పలు పరీక్షల అనంతరం గుండెలో కొన్ని బ్లాక్స్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు.

➡️