‘సత్యభామ’ వాయిదా..

May 23,2024 19:10 #Kajal Aggarwal, #movie

కాజల్‌ అగర్వాల్‌ తన కెరీర్‌లో చేస్తున్న 60వ చిత్రం ‘సత్యభామ’. సురన్‌ చిక్కాల తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల చాలాసార్లు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ఈ మే 25న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు ఆ డేట్‌ కూడా వాయిదా పడింది. ఈ సినిమా ఈ జూన్‌ 7న రిలీజ్‌కి రాబోతున్నట్టుగా చిత్రబృందం ఓ పోస్టర్‌ ద్వారా తెలిపింది. ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌, నాగినీడు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. ఆరం ఆర్ట్స్‌ నిర్మాణం వహించారు.

➡️