మెప్పించని సైంధవ్‌

Jan 22,2024 10:43 #movie

వెంకటేష్‌ 75వ సినిమాగా వచ్చిన ‘సైంధవ్‌’ పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. వెంకటేష్‌ టేకింగ్‌, యాక్టింగ్‌ ఫర్వాలేదనిపించినా స్క్రీన్‌ప్లేలో సాగదీత ధోరణి కనిపించింది. కథనంలో కూడా పొంతనలేని అంశాలను స్పృశించారు. దీంతో ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. మొదటి షో నుండే సినిమాపై అంచనాలన్నీ తలకిందులయ్యాయి. వెంకటేష్‌ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువ. కానీ ఈ సినిమా అంతా యాక్షన్‌ మోడ్‌తో తెరకెక్కించారు. భావోద్వేగ అంశాల ప్రభావం పెద్దగా లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

➡️