సీక్వెల్‌కు సిద్ధం అవుతున్న ‘యానిమల్‌’..!

Dec 16,2023 15:30 #movies

డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్‌ కపూర్‌, రష్మిక కాంబినేషన్‌లో తెరకెక్కించిన తాజా సినిమా ‘యానిమల్‌’. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. విడుదలైన 15 రోజుల్లో రూ. 800 కోట్లు రాబట్టిన ‘యానిమల్‌’ మూవీ.. డిసెంబర్‌ 21 లోపు వెయ్యి కోట్ల మార్క్‌ టచ్‌ చేసేలా ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఎండింగ్‌లో సీక్వెల్‌ ‘అనిమల్‌ పార్క్‌’ అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. పోస్ట్‌ క్రెడిట్స్‌లో వచ్చిన ‘అనిమల్‌ పార్క్‌’ గ్లింప్స్‌ ఆడియన్స్‌కు గూస్‌ బంప్స్‌ తెప్పించాయి. ఈ గ్లింప్స్‌లో రణబీర్‌ని మరింత వైల్డ్‌గా ప్రెజెంట్‌ చేశాడు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగ. రణబీర్‌ ‘బ్రహ్మాస్త్ర 2’ కి, ప్రభాస్‌ కమిట్మెంట్స్‌ కంప్లీట్‌ అవ్వడానికి టైం పడుతుందట. ఈ గ్యాప్‌లో ‘అనిమల్‌ పార్క్‌’ సినిమాను కంప్లీట్‌ చేయడానికి సిందీప్‌ రెడ్డి వంగ రెడీ అవుతున్నాడని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా.. ‘అనిమల్‌ పార్క్‌’ మూవీ గురించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది.

➡️