అల్లు అర్జున్‌తో అట్లీ సినిమా

Apr 5,2024 20:42 #allu arjun, #New Movies Updates

తమిళ దర్శకుడు అట్లీ నిర్మాతగా టాలీవుడ్‌ నటుడు అల్లు అర్జున్‌తో పాన్‌ ఇండియా సినిమా తీయబోతున్నారు. రాజారాణీ చిత్రంతో దర్శకుడుగా తన ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత విజరు హీరోగా మెర్సిల్‌, తెరి, బిగిల్‌ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి షారూక్‌ఖాన్‌తో ‘జవాన్‌’ తెరకెక్కించి హిట్‌కొట్టారు. అల్లు అర్జున్‌కు జోడీగా త్రిషను ఎంపిక చేసినట్లుగా సమాచారం. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుండగా గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నట్లుగా సమాచారం. ఈనెల 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజున అధికారిక ప్రకటన వెలువడనున్నట్లుగా తెలిసింది.

➡️