సరికొత్తగా బాలకృష్ణ సినిమా : బాబీ

Dec 25,2023 19:51 #New Movies Updates

‘భగవంత్‌ కేసరి సినిమా తర్వాత వస్తున్న మా సినిమా వేరే లెవల్‌లో ఉంటుంది. ఇటీవల ఊటీలో ఒక భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ను పూర్తిచేశాం. మరో షెడ్యూల్‌ కోసం రాజస్థాన్‌ వెళ్లనున్నాం. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ వచ్చే ఏడాదిలో ప్రకటిస్తాం’ అని దర్శకుడు బాబీ వెల్లడించారు. రెగ్యులర్‌షాటింగ్‌ జరుగుతున్న ఈ సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విషయాలపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌…వయెలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌’ అనే క్యాప్షన్‌ పోస్టర్‌లో ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కేరళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నారనీ, హీరోయిన్‌ తమన్నా ఓ ప్రత్యేక పాటలో నటించనున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఎన్‌బికె 109 టైటిల్‌ ఉంటుందనే ఊహాగానాలపైన కూడా చిత్రబృందం స్పందించలేదు.

➡️