హీరోలను స్టార్ హీరోలుగా చేసిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను, జానపద పాటయైన యాదమ్మ.. సాంగ్‌ను మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. విలేకరులకు ప్రదర్శించారు. ఈ సాంగ్ జానపద బాణీలతో వుంటూ అలరించింది. ట్రైలర్ మరింత ఆకట్టుకుంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ విఎస్.ఆర్, నల్గొండ గద్దర్ నర్సన్న, నటి స్నిగ్థ, ఆర్ట్ డైరెక్టర్ ఆంథోని, కొరియో గ్రాఫర్ శ్యామ్, బిత్తిరి సత్తి, చిత్ర దర్శకుడు బాలాచారి, షకలకల శంకర్, దర్శకుడు వి. సముద్ర తదితరులు పాల్గొన్నారు.