చిరు కొత్త చిత్రం టైటిల్ ఇదే…

chiru new movie

సంక్రాంతి పండగ సందర్భంగా చిరు అభిమానులకు సర్ప్రైజ్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం టైటిల్ ను విడుదల చేశారు. విశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్ బ్యానర్ పై రాబోతున్న ఈ చిత్రానికి ‘విశ్వంభర’ పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్త నిర్మాతలుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీత దర్శకుడిగా ఉన్నారు. చోటా కె నాయుడు సినిమా ఫోటోగ్రఫీ ఇవ్వనన్నారు. కాగా ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలిపారు.

➡️