హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న ‘దృశ్యం’

Feb 29,2024 18:15 #drishyam, #mohanlal, #movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : మలయాళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన మూవీ ‘దృశ్యం’. మోహన్‌లాల్‌, మీనా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రీమేక్‌లు తెరకెక్కి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం హాలీవుడ్‌లో కూడా రీమేక్‌ కానుంది. దీంతో హాలీవుడ్‌లో రీమేక్‌గా తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా దృశ్యం సినిమానే నిలవడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లీష్‌, స్పానిష్‌ భాషల్లో కూడా తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది. అయితే హాలీవుడ్‌ చిత్రంలో నటించే నటీనటులు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కాగా, మలయాళం ‘దృశ్యం’ సినిమాలో మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. తెలుగులో వెంకటేష్‌, మీనా, తమిళ్‌లో కమల్‌హాసన్‌, గౌతి, హిందీలో అజరు దేవగణ్‌, శ్రియా నటించారు. దృశ్యం మూవీ సీక్వెల్‌గా తెరకెక్కిన దృశ్యం 2 మూవీ కూడా హిట్‌ కొట్టింది. దృశ్యం 3 మూవీ కూడా త్వరలో మలయాళంలో విడుదల కానుంది.

➡️