‘డంకీ’ ఫైనల్‌ ట్రైలర్‌

Dec 5,2023 20:25 #moives

షారూఖ్‌ ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’. మంగళవారం ఈ చిత్రం నుండి ‘డంకీ డ్రాప్‌ 4’ పేరుతో ఫైనల్‌ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పంజాబ్‌లో నివసించే నలుగురు యువతీ యువకులు లండన్‌లో సెటిల్‌ అవ్వాలని కలలు కంటూ ఉండడం, ఆ క్రమంలో ఇంగ్లీష్‌ నేర్చుకునేందుకు ప్రయత్నించి విఫలం అవడం, వీసా రాక పోవడంతో లండన్‌ వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్న నేపథ్యంలో వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది ట్రైలర్‌లో చూపించారు. డిసెంబర్‌ 21న ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ధర్మేంద్ర, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్‌, బోమన్‌ ఇరానీ, దియా మిర్జా, విక్రమ్‌ కొచ్చర్‌, అనీల్‌ గ్రోవర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

➡️