‘ఫ్యామిలీ స్టార్‌’ నాకు బాగా కనెక్ట్‌ అయ్యింది

Dec 21,2023 19:05 #movie, #vijay devarakonda

విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా తెరకెక్కుతోంది. ‘గీత గోవిందం’ తీసిన పరశురామ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. షూట్‌ నిమిత్తం విదేశాల్లో ఉన్న విజరు ఇటీవలే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘నేను చేసిన అన్ని సినిమాల కన్నా ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీతో బాగా కనెక్టయ్యాను. ఇది నా స్టోరీలానే అనిపించింది. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పెద్దవాళ్లు చూస్తుంటారు. ఉన్నత విద్య అందించాలని చూస్తారు. కంఫోర్ట్‌ లైఫ్‌ ఉండాలనుకుంటారు. నా తల్లిదండ్రులు కూడా అలానే కష్టపడ్డారు. ముఖ్యంగా సినిమాలోని క్యారెక్టర్తో నేను బాగా కనెక్టయ్యాను. ఈ సినిమా కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.

➡️