ఫియర్‌ షూటింగ్‌ ప్రారంభం

Jan 17,2024 19:23 #movie, #sohel

అరవింద్‌కృష్ణ, వేదిక లీడ్‌రోల్‌లో నటిస్తున్న ‘ఫియర్‌’ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సినీ నటులు ఎం.మురళీమోహన్‌ స్క్రిప్ట్‌ అందించగా, డైరెక్టర్‌ కరుణాకరన్‌ క్లాప్‌ నిచ్చారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్‌ ఎఆర్‌ అభి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుజాతరెడ్డి కో ప్రొడ్యూసర్‌గా, దర్శకురాలుగా హరిత గోగినేని వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్‌ తేజ కాకుమాను, హీరో సోహైల్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. హరిత గోగినేని మాట్లాడుతూ దత్తాత్రేయ మీడియా నా ఫ్యామిలీ బ్యానర్‌ లాంటిది. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చేలా స్క్రిప్ట్‌ తయారుచేశానన్నారు. ఎఆర్‌ అభి మాట్లాడుతూ తన సతీమణి అయిన హరిత చాలా చక్కగా స్క్రిప్ట్‌ చేశారన్నారు. ఈ సినిమాలో పవిత్ర లోకేష్‌, అనీష్‌ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటిస్తున్నారు.

➡️