Filmfare Awards 2024: ఉత్తమ చిత్రం.. 12thఫెయిల్‌

Jan 29,2024 11:56 #Filmfare Awards

అహ్మదాబాద్‌ : బాలీవుడ్‌ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల జాబితా వచ్చేసింది. 69వ ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డుల వేడుక గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా అట్టహాసంగా జరిగింది. 2023 విడుదలైన చిత్రాలకుగాను ఈ అవార్డులను ప్రకటించారు. గతేడాది అక్టోబర్‌లో విడుదలై సంచలనం సృష్టించిన 12 ఫెయిల్‌ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రం ముంబయి అడిషనల్‌ కమిషనర్‌ అయిన మనోజ్‌కుమార్‌ శర్మ బయోపిక్‌. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సొంతం చేసుకోవడమే కాకుండా.. అవార్డులు కూడా వరించాయి. ఉత్తమ చిత్రంతోపాటు, దర్శకుడు వినోద్‌ చోప్రాకు ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా వరించింది. అలాగే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌కి ‘యానిమల్‌’ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడు అవార్డు లభించింది.

అవార్డుల జాబితా

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌
ఉత్తమ దర్శకుడు:  విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)
ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)
ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌
ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)
ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)
ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

➡️