మే 17న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’

Mar 16,2024 20:41 #New Movies Updates, #viswaksen

విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 8న రిలీజ్‌ కావాల్సిన ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా శనివారం మే 17న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుందని చిత్రబృందం ఒక పోస్టర్‌ ద్వారా ప్రకటించారు.

➡️