హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ టైటిల్‌ సాంగ్‌ విడుదల

చైతన్యరావు, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్మెంట్‌ (యుఎస్‌ఎ) సమర్పణలో న్యూ రీల్‌ ఇండియా ఎంటర్‌టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై కె.కె.ఆర్‌, బాల రాజ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖర్‌ దర్శకుడు. కళ్యాణి మాలిక్‌ సంగీతం అందించారు. ఇప్పటికే హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ఆదివారం నాడు ఈ చిత్రంలోని టైటిల్‌ ట్రాక్‌నుదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘దర్శకుడు బాల అమెరికాలో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీన్‌గా పనిచేశాడు. ఇప్పుడు సొంత డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. పాప్‌ సింగర్‌ స్ఫూర్తి జితేందర్‌ ఈ టైటిల్‌ పాటను స్వరపరచి ఆలపించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని రాఘవేంద్రరావు అన్నారు.

➡️