హీరోగా చేస్తాననుకోలేదు

Apr 3,2024 19:10 #movie, #surya teja

సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. ‘దొరసాని’ ఫేమ్‌ కెవిఆర్‌ మహేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పిఆర్‌ ఫిలింస్‌ పతాకంపై పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం విడుదలకు కానుంది. ఈ సందర్భంగా హీరో సూర్య తేజ చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘నిజానికి నేను హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలి, డైరెక్షన్‌ చేయాలనే ఆసక్తి వుండేది. కాలేజ్‌ పూర్తయిన తరవాత రచనపై ఆసక్తి ఏర్పడింది. కథ రాసినప్పుడు నేను హీరోగా చేస్తానని అనుకోలేదు. నిజానికి ఇందులో నా పాత్ర ఏ కొత్త నటుడు చేసినా బావుంటుంది. ఈ పాత్ర నేను చేస్తే బావుంటుందని దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒప్పుకున్నాను. అజరు ఘోష్‌, టెంపర్‌ వంశీ, వైవా హర్ష పాత్రలు రాసినప్పుడే వారినే అనుకున్నాను. వారి పాత్రలు చాలా డిఫరెంట్‌గా వుంటాయి. ఈ సినిమా కమర్షియల్‌గా చాలా మంచి ఎంటర్‌ టైనర్‌’ అని అన్నారు.

➡️