సమంత నటించిన ఆ వెబ్‌సిరీస్‌ నాకెంతో ఇష్టం : నాగచైతన్య

Nov 29,2023 13:35 #movie, #Naga Chaitanya, #samantha

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటి సమంత నటించిన వెబ్‌సిరీస్‌ల్లో ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ తనకెంతో ఇష్టమని ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య అన్నారు. చైతన్య తాజాగా ‘దూత’ సిరీస్‌ డిసెంబర్‌ 1వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చై ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ.. ‘సమంత నటించిన ద ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ నా ఫేవరెట్‌. ఈ సిరీస్‌ నాకు బాగా నచ్చింది.’ అని అన్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘తండేల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మెండేటి తెరకెక్కిస్తున్నారు. కాగా, ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీస్‌ రెండు పార్ట్‌లుగా తెరకెక్కింది. ఈ రెండు సిరీస్‌లు సమంతకు, నటుడు మనోజ్‌ భాజ్‌పారుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. నాగచైతన్య, సమంత అక్టోబర్‌ 2వ తేదీ 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ భార్యాభర్తలుగా ఉన్న సమయంలో నటించిన వెబ్‌సిరీస్‌ తనకెంతో ఇష్టమని చై చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.

➡️