‘జనక అయితే గనక’తో సుహాస్‌

సుహాస్‌ నటించబోతున్న కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను తాజాగా చిత్రబృందం ప్రకటించింది. దిల్‌ రాజు ప్రొడక్షన్‌ బ్యానర్‌పై హన్సితా రెడ్డి, హర్షిత్‌ రెడ్డి ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమాకు సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘జనక అయితే గనక’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన టైటిల్‌ అనౌన్స్మెంట్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు విజరు బుల్గనిన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. జూలై 4న ఈ సినిమా టీజర్‌ని కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

➡️