‘యానిమల్‌’ చిత్రంపై కిరణ్‌ రావు విమర్శ – సందీప్‌ వంగా స్పందన

Feb 3,2024 11:40 #'Animal', #criticism, #Sandeep Vanga

ముంబయి : రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న జంటగా, సందీప్‌ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ చిత్రం విడుదల అయినప్పటి నుండి వివాదాస్పదంగా మారింది. అయితే ఈ చిత్రంలో శృంగారం, హింస ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ట్రోల్స్‌ ఆగడం లేదు. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌ రావు విమర్శలు గుప్పించారు. ‘బాహుబలి’, ‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ చిత్రాలు స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సందీప్‌ వంగా ప్రతిస్పందించారు…. కిరణ్‌ రావు చేసిన వ్యాఖ్యలను తాను విన్నానని… ఆమెకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని… ఆమె మాజీ భర్త ఆమిర్‌ ఖాన్‌ చిత్రం ‘దిల్‌’ గురించి ఆయనను అడగమనండి అని సందీప్‌ వంగా చెప్పారు.

➡️