ఎల్‌ఐసి టైటిల్‌ వివాదం

Dec 17,2023 09:13 #movie, #vignesh sivan

ఏడాది విరామం తర్వాత మెగాఫోన్‌ పట్టారు నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌. ఎల్‌ఐసీ (లవ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌). ప్రదీప్‌ రంగనాథన్‌, కృతిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. కాగా, ఈ సినిమా టైటిల్‌ విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. 2015లోనే తాను ‘ఎల్‌ఐసీ’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించుకున్నానని సంగీత దర్శకుడు, దర్శకుడు ఎస్‌.ఎస్‌.కుమారన్‌ పేర్కొన్నారు. ఆ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని తెలిపారు.

➡️