5న ప్రేమకథ విడుదల

Dec 27,2023 09:00 #movie

కిశోర్‌ కెఎస్‌డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రేమకథ జనవరి ఐదోతేదీన విడుదల కానుంది. టాంగా ప్రొడక్షన్‌ ఎల్‌ఎల్‌పీ, సినీ వ్యాలీ మూవీస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. నిర్మాతలు విజయ్ మట్టపల్లి, సుశీల్‌ వాజపిల్లి, శింగనమల కళ్యాణ్‌, ఉపేందర్‌గౌడ్‌ ఎర్ర సహ నిర్మాత, శివశక్తి రెడ్‌ డీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌, ఎవడు మనోడు వంటి లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదల తేదీన చిత్రబృందం ప్రకటించింది. రాజ్‌ తిరందాసు, వినరు మహదేవ్‌, నేత్ర సాధు తదితరులు నటించారు.

➡️