లూసిఫర్‌-2 మోహన్‌లాల్‌

May 21,2024 19:10 #mohanlal, #movie

మోహన్‌లాల్‌ నటిస్తున్న లూసిఫర్‌2 చిత్రం నుంచి ఆయన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ, లూసిఫర్‌ 2 పోస్టర్‌ను డైరెక్టర్‌, హీరో పృథ్వీరాజ్‌ పోస్ట్‌ చేశారు. సీక్వెల్‌ కోసం మురళీ గోపి కథ అందించగా పృథ్వీరాజ్‌ దర్శకత్వం చేస్తున్నారు. గతేడాదిలోనే షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు మంజు వారియర్‌, టోవినో థామస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘లూసిఫర్‌’లో స్టీఫెన్‌ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా మోహన్‌లాల్‌ కనిపించారు. అయితే, ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు ఈ ప్రపంచాన్నే శాసించే మాఫియాకు అధినేతగా ఉంటారు. మాఫియా డాన్‌ అబ్రహం ఖురేషి సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అంత స్థాయికి ఎలా చేరుకున్నాడు? రాజకీయాలకు ముందు ఆయన ఏం చేశాడు? ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? అనేది తెలియాలంటే లూసిఫర్‌ా2 వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. లూసిఫర్‌ చిత్రాన్ని తెలుగులో గాడ్‌ఫాదర్‌ పేరుతో చిరంజీవి రీమేక్‌ చేశారు.

➡️