Dulquer Salmaan: 19న ‘లక్కీ భాస్కర్‌’ ఫస్ట్‌ సింగిల్‌

దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రబృందం ఈ చిత్రం నుండి ఫస్ట్‌ సింగిల్‌ అపడేట్‌ ఇచ్చారు. జూన్‌ 19న ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

➡️