‘నా సామిరంగ’ నుంచి లిరికల్‌ వీడియో రిలీజ్‌

Dec 10,2023 15:03 #New Movies Updates

కింగ్‌ నాగార్జున, ఆషికా రంగనాథ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్‌ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘నా సామిరంగ’ చిత్రం నుంచి తొలి సింగిల్‌ రిలీజైంది. ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే…’ కీరవాణి బాణీలకు చంద్రబోస్‌ సాహిత్యం సమకూర్చారు. ఈ గీతాన్ని రామ్‌ మిరియాల ఆలపించారు.

➡️