మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం

Apr 5,2024 13:18 #meera jasmin, #movie

కొచ్చి : ప్రముఖ నటి మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ఫిలిప్‌ శుక్రవారం కొచ్చిలో కన్నుమూశారు. ఆయన గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురైతే కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఈరోజు మృతి చెందారు.

కాగా, నటి మీరాజాస్మిన్‌ మీడియాలో తన కుటుంబం గురించి మాట్లాడిన సందర్భాలు తక్కువే. తన కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగానే అనీల్‌ జాన్‌ని 2014లో వివాహం చేసుకుంది. అయితే వివాహం తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు. ఈ జంట రెండేళ్లకే 2016లోనే విడాకులు తీసుకుంది. ఆమె విడాకుల అనంతరం మళ్లీ సినిమాల్లో నటిస్తోంది.

మీరాజాస్మిన్‌లో 2001లో మలయాళ ‘సూత్రధారన్‌’ ‘సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తమిళ చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో హీరో శివాజీకి జంటగా ‘అమ్మాయి బాగుంది’ అనే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌తో ‘గుడుంబా శంకర్‌’, రవితేజతో ‘భద్ర’, బాలకృష్ణతో ‘మహారథి’, శ్రీకాంత్‌తో ‘యమగోల మళ్లీ మొదలైంది’, రాజశేఖర్‌కి చెల్లెలుగా ‘గోరింటాకు’ వంటి సినిమాల్లో నటించింది. ఇటీవలే ‘విమానం’ సినిమాలో ఓ అతిథి పాత్రలో నటించింది.

➡️