వర్షంలోనే ఎక్కువగా ‘దూత’ చిత్రీ కరణ : నాగచైతన్య

Nov 27,2023 19:39 #movies

‘దూత’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు నాగ చైతన్య. ఆయన నటించిన తొలి సిరీస్‌ ఇదే. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 1న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానుంది. ప్రచారంలో భాగంగా ఈ చిత్ర విశేషాలను హీరో నాగచైతన్య వివరించారు. ‘దూత’ అంటే మెసేంజర్‌. ఇందులో నేను జర్నలిస్ట్‌ సాగర్‌ పాత్రలో నటించాను. ఈ సిరీస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది 8 ఎపిసోడ్‌లలో అలరించనుంది. ఇందులో ఎక్కువ సన్నివేశాలు వర్షంలోనే చిత్రీకరించారు’ అని చెప్పారు. ఇక గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వేడుకల్లో దీని మొదటి ఎపిసోడ్‌ను ప్రదర్శించారు. ఈ వేడుకలకు నాగచైతన్య, విక్రమ్‌ కె కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగచైతన్య మీడియాతో మాట్లాడారు.

➡️